![]() |
![]() |
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -646 లో.....దుగ్గిరాల ఇంట్లోని వారందరూ నగలు తీసుకొని హాల్లో పెడతారు. కావ్య పక్కకి వెళ్లి అప్పుకి ఫోన్ చేసి ఆ నందుగాడు దొరికాడా అని అడుగుతుంది.. ఇప్పుడే అక్కడికి వెళ్తున్నామని అప్పు చెప్తుంది. అందరు నగలు పెడతారు కానీ రుద్రాణి ఒక్కతే నగలు దాచుకుంటుంది. వెళ్లి తీసుకొని రా అంటూ అందరు అంటారు. నేను తీసుకొని రాను.. అసలు మాటకి వస్తే నాకు నగలు లేవని రుద్రాణి అంటుంది.
తాతయ్య గారు నీ పెళ్లికి చాలానే నగలు పెట్టారంట కదా..మర్యాదగా తీసుకొని రా అని స్వప్న అంటుంది. నాకేం నగలు లేవు.. నాకు ఈ ఇంటికి ఏం సంబంధం లేదు.. నా వంశం వేరే వెళ్ళది వేరే అని రుద్రాణి అనగానే.. అందరు షాక్ అవుతారు. ఆస్తులలో వాటా అడిగినప్పడు ఇలా అనలేదని రుద్రాణిపై అపర్ణ విరుచుకుపడుతుంది. నా నగల గురించి ఎందుకు బయటపెట్టావ్.. నీ నగల గురించి బయట పెడతాను.. వెళ్లి బెడ్ కింద దాచిన నగలు తీసుకొని రా అని ధాన్యాలక్ష్మి అంటుంది. దాంతో స్వప్న వెళ్లి నగలు తీసుకొని వస్తుంది..అన్ని ఆస్తులు నగలు బ్యాంక్ వాళ్ళు లెక్కలు చూసుకుంటారు. మరొక వైపు సీఐ నందగోపాల్ ని కలుస్తాడు. అదంతా అప్పు వీడియో తియ్యమని కానిస్టేబుల్ కి చెప్తుంది. సీఐకి నందగోపాల్ డబ్బులు ఇస్తాడు. వెంటనే అప్పు వాళ్ళ దగ్గరికి వెళ్లి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటుంది.
మరోవైపు బ్యాంక్ వాళ్ళు పేపర్స్ పై సీతారామయ్యని సంతకం చేయమని చెప్తారు. సీతారామయ్య సంతకం చేయబోతుంటే అప్పు నందగోపాల్ ని తీసుకొని వస్తుంది. మీరు వెతుకుతున్న నందగోపాల్ వీడే.. అప్పు కట్టాల్సింది వీడే అని బ్యాంకు వాళ్ళకీ చెప్పగానే వాడి ప్రాపర్టీ మొత్తం హ్యాండ్ ఓవర్ చేసుకుంటామని బ్యాంకు వాళ్లు వెళ్ళిపోతారు. అందరు అప్పుకి థాంక్స్ చెప్తారు. నా నగలు నాకు ఉన్నాయంటూ రుద్రాణి హ్యాపీగా ఫీల్ అవుతుంది. తరువాయి భాగం లో ఇన్ని రోజులు ఎన్ని అవమానాలు భరించారని కావ్య, రాజ్ లతో అపర్ణ అంటుంది. ఇక ప్రాబ్లెమ్ క్లియర్ అని అపర్ణ అంటుంటే.. ఇంకా అసలు ప్రాబ్లెమ్ ఉంది.. ఆస్తులు పంచాలని నిర్ణయం తీసుకున్నానని సీతారామయ్య అనగానే.. అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |